మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:35

సుందరంగా భద్రకాళి బండ్‌

సుందరంగా భద్రకాళి బండ్‌

  • వచ్చేవారం ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

వరంగల్‌: సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొన్న భద్రకాళి బండ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు భద్రకాళి బండ్‌ను సందర్శించారు. అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బండ్‌ను ప్రారంభిస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. భద్రకాళి బండ్‌ వరంగల్‌ నగర ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని, ఇది రాష్ర్టానికే మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బండ్‌ను పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన వెంట కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా)  చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేల సత్పతి ఉన్నారు. 


logo