మంగళవారం 26 మే 2020
Telangana - May 06, 2020 , 22:56:09

ముగిసిన భద్రకాళి బ్రహ్మోత్సవాలు

ముగిసిన భద్రకాళి బ్రహ్మోత్సవాలు

వరంగల్‌ : వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి ఆలయంలో పది రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయ అర్చకులు భద్రకాళి చెరువులో కనుల పండువగా చక్రస్నానం జరిపించారు. అమ్మవారికి ఘటాభిషేకం, ఫుష్పయాగం నిర్వహించారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు చివరి అంకం ధ్వజావరోహణంతో పరిసమాప్తమాయ్యయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తులు లేకపోయినా వేదపండితుల సమక్షంలో సశాస్త్రీయంగా, భక్తి ప్రపత్తులతో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలు సకలైశ్వర్యాలతో వర్ధిల్లుతారని, త్వరలోనే కరోనా బారి నుంచి ప్రపంచం విముక్తమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సౌజన్యంతో చక్రతీర్థోత్సవం, పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. 


logo