గురువారం 16 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 21:12:35

8 నుంచే భద్రాద్రి రామయ్య దర్శనం

8 నుంచే భద్రాద్రి రామయ్య దర్శనం

భద్రాచలం: భద్రాద్రి రామాలయంలో ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రామయ్యస్వామి పునః దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ నుంచి ఈ రోజు ఆలయ అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ ఏడాది మార్చి 20 నుంచి ఇప్పటి వరకు ఆలయం మూత పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో అర్చకులు నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో ఆన్‌లైన్‌ పూజలు జరిగాయి. తిరిగి స్వామి వారి దర్శనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కొన్ని సూచనలను భక్తులకు వెల్లడిస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో భద్రాద్రి రామాలయం, పర్ణశాల రామాలయంలోని హుండీల్లో నగదు లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో నర్సింహులు తెలిపారు. దీంతో దేవస్థాన ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందుతుందన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గత నెల నుంచి వేతనాలు నిలిచిపోయాయి. తిరిగి భక్తుల దర్శనాలు ప్రారంభకానుండటంతో వారి సమస్య కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

భక్తులకు సూచనలు..

  • పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుపై బడిన వృద్ధులకు స్వామివారి దర్శనానికి అనుమతి లేవు.
  • దేవస్థానం పరిధిలో కాటేజీ సౌకర్యం లేదు.
  • ఆలయ పరిసరాల్లో భక్తులు ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దు
  • భౌతిక దూరం పాటించాలి
  • భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ ఉంటుంది.


logo