శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 10:39:13

భద్రాచలం రామయ్య ఆలయం చారిత్రక ఘట్టాలు

భద్రాచలం రామయ్య ఆలయం చారిత్రక ఘట్టాలు

 • 1669లో తానీషా గోల్కొండ నవాబ్‌గా పదవి చేపట్టడం.
 • 1670లో రామదాసు (గోపన్న) హసనాబాద్‌ పరగణాకు (పాల్వంచ) అధికారిగా రావడం.
 • 1674లో రామదాసు ఆలయ నిర్మాణం చేసి జైలుకు వెళ్లాడు.
 • 1686లో రామదాసు జైలు నుంచి విడుదల.
 • 1687లో తానీషా ఔరంగజేబుకు పట్టుబడడం.
 • 1769లో ధంసా దురాక్రమణ
 • 1769లో భద్రాచలం రామాలయ ఉత్సవ మూర్తులు పోలవరం వలస వెళ్లుట.
 • 1775లో పోలవరం నుంచి ఉత్సవ మూర్తులు తిరిగి భద్రాద్రికి రావడం.
 • 1776లో మళ్లీ కమలాపురం (బస్తర్‌) వలస వెళ్లుట.
 • 1782లో ధంసా మరణించుట.
 • 1789లో నిజాం అలీ (రెండో నవాబ్‌) రామాలయానికి రూ.40వేలు కేటాయించడం.
 • 1790లో తూము నర్సింహదాసు జన్మించడం.
 • 1822లో నర్సింహదాసు దక్షిణ దేశయాత్రలు చేస్తూ తాగ్యరాజస్వామిని భద్రాద్రికి పిలవడం.
 • 1831లో తూము నర్సింహదాసు మంత్రి అయిన చందూలాల్‌ నుంచి ఆలయ అధికారాన్ని పొందడం.
 • 1832లో ఆలయంలో శాసన స్తంభాలు ప్రతిష్ఠించడం.
 • 1833లో వరదా రామదాసు భౌతికకాయంతో మరికొందరు భక్తులతో నర్సింహదాసు వైకుంఠ యాత్ర చేయడం.
 • 1835లో రాజా చందూలాల్‌ భద్రాచలం శ్రీసీతారామ చంద్రప్రభువుకు సనద్‌ ఇవ్వడం.
 • 1855లో ప్రభుత్వం దేవాలయ కైంకర్యానికి కొంత మొత్తం నిర్ణయించడం.
 • 1870లో భద్రాద్రి రామాలయ కార్యనిర్వాహణ నైజాం ప్రభుత్వం స్వీకరించడం.
 • 1874లో మధ్య పరగణాల నుంచి భద్రాద్రిని వేరుచేసి మద్రాసులో చేర్చడం.
 • 1918లో నైజాం సుబేదారులు దేవాలయ భృతిని విచారణ చేసి నిర్ణయించడం.
 • 1956లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ
 • 1958లో భద్రాచలం దేవాలయాన్ని ఆంధ్రా దేవాలయం పరిపాలనలోకి తేవడం.
 • 1961లో ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి రూ.20లక్షల వ్యయంతో నూతన గర్భాలయం, కల్యాణ మండపం, సత్ర నిర్మాణం చేపట్టడం.
 • 1965లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భద్రాచలం వద్ద గోదావరిపై వారధి నిర్మించడం.
 • 1968లో నూతన గర్భాలయం, కల్యాణ మండపాలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ (పెద్ద) జీయర్‌స్వామి, కంచి కామకోటి పీఠాధిపతులు ప్రతిష్ఠలు గావించడం.
 • 1968లో ప్రథమ ధర్మకర్తల మండలి ఏర్పాటు
 • 1971లో రామదాసు ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, పర్ణశాల నూతన దేవాలయ, చిత్రకూట మండప నిర్మాణం ప్రారంభించడం.
 • 1973లో వాగ్గేయ కారోత్సవాలు ప్రారంభించడం.
 • 1974లో పర్ణశాల నూతన దేవాలయం సంప్రోక్షణ శ్రీ పెరంబుదూరు జీయర్‌స్వామివారు నిర్వహించడం.
 • 1975లో భద్రాద్రి శ్రీ సీతారామచంద్రప్రభు వారికి నిత్యకల్యాణోత్సవములు ప్రారంభించడం.
 • 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన సత్రమును భద్రాచలం దేవస్థానానికి సమర్పించడం.
 • 1987లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం.
 • 2002లో చరిత్రాత్మక భద్రాద్రి ఉత్సవాల నిర్వహణ.
 • 2013లో రామాలయం మాడవీధుల ఏర్పాటు 


logo