బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 26, 2020 , 08:55:17

భద్రాచలం శ్రీరామ నవమికి ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం

భద్రాచలం శ్రీరామ నవమికి ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీరామ నవమికి మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలంలో ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి, 3న శ్రీరామ మహాపట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం తిలకించే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. www.bhadrachalamoneline.com ద్వారా టికెట్లు పొందవచ్చు. రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1,116, రూ.500, రూ.200,రూ.100 టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.


logo