గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 20:53:43

కళ్యాణ టిక్కెట్ల సొమ్ములు భక్తులకు వాపసు...

కళ్యాణ టిక్కెట్ల సొమ్ములు భక్తులకు వాపసు...

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకంకు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో 1003 టిక్కెట్లు విక్రయించడం జరిగిందని, వీటి ద్వారా రూ.13లక్షల 80వేల 600ల ఆదాయం వచ్చిందని, మిథిలా ప్రాంగణం వేదిక మారిన నేపథ్యంలో ఈ టిక్కెట్ల సొమ్ములను తిరిగి త్వరలోనే భక్తులకు ఇచ్చేయడం జరుగుతుందని దేవస్థానం ఈవో జీ.నరసింహులు తెలిపారు. త్వరలోనే వైదిక కమిటీతో సమావేశమై ఆలయ ప్రాంగణంలో నిర్వహించే కళ్యాణం, పట్టాభిషేకంపై తగు సమాలోచనలు జరుపుతామని ఈవో పేర్కొన్నారు. తమకు ఇంకా దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. 


logo