ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 19:50:13

ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి సేఫ్

 ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి సేఫ్

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. కోవిడ్‌-19 తీవ్రత విజృంభిస్తుండటంతో అందరూ తప్పకుండా ఇండ్లలోనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ..కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుక్‌లెట్‌ రూపొందించింది.

ఈ బుక్‌లెట్‌ను రాష్ట్రప్రభుత్వం తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్‌ సోకినా లక్షణాలు కన్పించని వారు, అనుమానిత లక్షణాలున్న వారు ఇంటి దగ్గర ఈ సూచనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వం నిర్దేశించింది.