e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home తెలంగాణ గ్రామాలకు రాచబాట

గ్రామాలకు రాచబాట

గ్రామాలకు రాచబాట
  • 1,800 కోట్లతో 2,400 కిలోమీటర్లు
  • పీఎంజీఎస్‌వైతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం
  • గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి గ్రామ్‌సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) ద్వారా మారుమూల పల్లెల రోడ్లకు మోక్షం లభించనున్నది. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,800 కోట్లతో 2,400 కిలోమీటర్ల రోడ్లతోపాటు పలు వంతెనలు నిర్మించనున్నారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్లు, వంతెల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. ప్రస్తుతం పీఎంజీఎస్‌వై- 3 పనులు జరుగుతున్నాయి. ఈ ఫేజ్‌కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో దాదాపు 2,400 కిలోమీటర్ల మేర రోడ్లు వేయనున్నారు. ఇందుకోసం రూ.1,495 కోట్లను వెచ్చించనున్నారు. గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాగులు, లో లెవల్‌ కాజ్‌వేలు ఉన్న వాటిపై బ్రిడ్జిలు నిర్మించనున్నారు. మొత్తం 100 బ్రిడ్జిల కోసం రూ.301 కోట్లు వెచ్చిస్తారు. వీటికి సంబంధించిన టెండర్లు పిలిచారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నారు. వీటన్నింటికయ్యే వ్యయంలో కేంద్రం 60%, రాష్ట్రప్రభుత్వం 40% భరిస్తాయి. గ్రా మాల నుంచి మండలాలు, రాష్ట్ర, జాతీయ, రహదారులకు అనుసంధానంతో మెరుగైన రవాణా సౌకర్యాలు లభ్యం కానున్నాయి.

గ్రామాలకు రాచబాట
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాలకు రాచబాట
గ్రామాలకు రాచబాట
గ్రామాలకు రాచబాట

ట్రెండింగ్‌

Advertisement