శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 00:29:45

ప్రజలకు మెరుగైన సేవలు.. మంత్రి గంగుల

ప్రజలకు మెరుగైన సేవలు.. మంత్రి గంగుల

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ఆలోచనలతో సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌.. పురపాలక శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. నగరాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారన్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ విభాగం కొత్త వాహనాలను శనివారం కార్యాలయ ఆవరణలో మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు. 


logo