గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 18:54:36

కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించాలి

కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించాలి

అదిలాబాద్ : కొవిడ్-19 వ్యాధి గ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిమ్స్ ను సందర్శించిన కలెక్టర్ కరోనా ఓపీ,హెల్ప్ డెస్క్, ఐసీయూ ఐసోలేషన్, మెటర్నిటీ వార్డ్, హెచ్ఐవీ, కొవిడ్ ల్యాబ్ లను సందర్శించారు. ఆక్సిజన్ కేంద్రాన్ని పరిశీలించి పనులను వేగవంతం చేయాలన్నారు. 

రిమ్స్ లో ఏర్పాటు చేసిన కరోనా వార్డ్, ఇతర అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని, సెక్యురిటీ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది తో మాట్లాడారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, కొవిడ్ నోడల్ అధికారులు డా. సందీప్, డా. తానాజీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు


logo