ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 19:44:26

కళావతికి మెరుగైన వైద్యం అందించాలి

కళావతికి మెరుగైన వైద్యం అందించాలి

సిద్ధిపేట : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట గ్రామ అంగన్ వాడీలో పని చేసే ఆయా కరికె కళావతికి మెరుగైన వైద్యం అందించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యులకు సూచించారు. డబ్బు ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. జూన్‌ 2న దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన కళావతి జాతీయ జెండా ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నది. 

ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి దవాఖానకు వెళ్లి కళావతిని పరామర్శించారు. ఆమెకు మనవతా దృక్పథంతో సేవలు అందించాలని సూపరింటెండెంట్‌ మహేశ్‌, వైద్యులను  మంత్రి హరీశ్‌రావు కోరారు. తక్షణ అవసరాల కోసం రూ.50 వేల నగదును అందజేశారు. 


logo