శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 11:55:35

బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యం

బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యం

మేడ్చల్ : బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేదలకు చేరువగా మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్ లో.. నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అనంతరం మారుతీనగర్ లో రూ.17.50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo