శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 14:24:01

మూగ జీవాల‌కు మెరుగైన వైద్య సేవ‌లు : మ‌ంత్రి త‌ల‌సాని

మూగ జీవాల‌కు మెరుగైన వైద్య సేవ‌లు : మ‌ంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : రాష్ర్టం ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ఆధ్వ‌ర్యంలో మూగ జీవాల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ రేబిస్ డే సంద‌ర్భంగా మాసాబ్‌ట్యాంక్‌లోని ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ కార్యాల‌యంలో వీధి శున‌కాల‌కు ఉచితంగా టీకాల పంపిణీ పోస్ట‌ర్‌ను ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. జంతు సంర‌క్ష‌ణ‌కు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చే సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. రాష్ర్ట ఎనిమ‌ల్ బోర్డు ఆధ్వ‌ర్యంలో జీవాల సంర‌క్ష‌ణ‌కు అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే జిల్లా ఎనిమ‌ల్ బోర్డు క‌మిటీల పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని గోశాల‌లోని జీవాల‌కు 1962 టోల్ ఫ్రీ నంబ‌ర్ ద్వారా సేవ‌లు అందుతున్నాయ‌ని చెప్పారు. సంచార ప‌శు వైద్య‌శాల‌లు జీవాల వ‌ద్ద‌కే వెళ్లి సేవ‌లందిస్తున్నాయ‌ని ఉద్ఘాటించారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వీధి శున‌కాల‌కు ఆహారం అందించిన సంస్థ‌ల నిర్వాహ‌కుల‌ను మంత్రి త‌ల‌సాని అభినందించారు. 


logo