బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 12:02:23

బెంగళూరు గూగుల్‌ ఉద్యోగికి కరోనా...

బెంగళూరు గూగుల్‌ ఉద్యోగికి కరోనా...

బెంగళూరు: కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బెంగుళూరు గూగుల్‌ కార్యాలయంలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటీవ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఉద్యోగికి కరోనావైరస్‌ సోకినట్లు గూగుల్‌ స్వయంగా ప్రకటించింది. అతనితో పనిచేసిన ఉద్యోగులకు ఇంటివద్దనే ఉండాలని, ఇంటివద్ద నుంచే పనిచేయాలని సూచించినట్లు తెలిపింది. వైరస్‌ సోకిన ఉద్యోగిని పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది.

ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఉద్యోగులు వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. ఇప్పటికే యూరప్‌, అమెరికా, ఇతర వైరస్‌ప్రభావిత దేశాల్లోని ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు దేశంలో 75 మంది కరోనావైరస్‌కు గురికాగా కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని విమానాశ్రయంల్లో దాదాపు 11లక్షల 14 వేల మంది విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 


logo