శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:35:25

18,525 మంది ఎస్సీలకు లబ్ధి

18,525 మంది ఎస్సీలకు లబ్ధి

  • రూ.786.23 కోట్లతో ప్రత్యేక వార్షిక ప్రణాళిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్సీ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా ప్రత్యేక వార్షిక ప్రణాళికను రూపొందించింది. 18,525 మందికి లబ్ధిచేకూరేలా రూ.786.23 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలవారీగా ఆయాకార్యక్రమాలు, పథకాల అమలుకు కేటాయించిన నిధులను విభాగాలవారీగా నిర్ణయించి 2021 మార్చిలోగా లబ్ధిదారులకు చేరేలా అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ మేరకు కేటాయించిన నిధులు.. పూర్తిస్థాయిలో వినియోగంపై ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రణాళికలు రూపొందించి ఆయా జిల్లాల అధికారులకు పుస్తకం రూపంలో అందించింది. ఎస్సీ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా కేటాయించిన రూ.786.23 కోట్లలో ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్‌ సబ్సిడీ రూ.500 కోట్లు, బ్యాంకు రుణం రూ.279.02 కోట్లు, ఈఎంఎఫ్‌, ఇతర శాఖాపరమైన సబ్సిడీ రూ.7.21కోట్లు అందించనున్నారు.