బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 01:48:06

కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి

కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి

  • టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌

మెదక్‌ అర్బన్‌: తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వం లో అన్ని వర్గాలవారు లబ్ధిపొందుతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు. సోమవారం టీఎన్జీవో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాం రావు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని మెదక్‌ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోభవన్‌లో సన్మానించా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమమే ధ్యే యంగా టీఎన్జీవో సంఘం పని చేస్తున్నదన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఉద్యోగి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వానికి 18 సమస్యలతో కూ డిన మెమోరాండం ఇచ్చామన్నారు. పీఆర్సీ వెంటనే విడుదల చేయాల ని,ఎక్కడివారికి అక్కడే పోస్టింగ్‌ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు.