మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:34:49

కొవాగ్జిన్‌ పూర్తి సురక్షితం

కొవాగ్జిన్‌ పూర్తి సురక్షితం

  • అసత్య ప్రచారాలు నమ్మొద్దు : భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి తమ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌' పూర్తి సురక్షితమని భారత్‌ బయోటెక్‌ పేర్కొన్నది. ఈ ఏడాది ఆగస్టులో ఫేజ్‌-1 ట్రయల్స్‌ సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని వస్తున్న వార్తలను శనివారం ఒక ప్రకటనలో ఖండించింది. ఒక వలంటీర్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే డీసీజీఐకి సమాచారం అందించామని తెలిపింది. వారు 24 గంటల్లోనే లోతుగా విచారణ నిర్వహించారని, అది వ్యాక్సిన్‌ వల్ల తలెత్తిన సమస్య కాదని తేల్చిందని స్పష్టంచేసింది. ఆ వ్యక్తి పూర్తిస్థాయిలో కోలుకున్నారని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఎథిక్స్‌ కమిటీలు, సీడీఎస్‌సీవో- డీసీజీఐ ముందు ఉంచామని వివరించింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఫేజ్‌-2, ఫేజ్‌-3 ట్రయల్స్‌కు అనుమతులు వచ్చాయని పేర్కొన్నది.