శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 16:09:51

అవ‌త‌లి వ్య‌క్తి కోణాన్ని అర్థం చేసుకోవాలి... లేదంటే ఇలాగే.. వీడియో

అవ‌త‌లి వ్య‌క్తి కోణాన్ని అర్థం చేసుకోవాలి... లేదంటే ఇలాగే.. వీడియో

హైద‌రాబాద్ : స‌త్యం ఎప్పుడూ ఒక్క‌టే ఉంటుంది. కానీ అది చూసే కోణాన్ని బ‌ట్టి మారుతుంటుంది. నీవైపు నుంచి చూస్తే ఒక‌లా.. ఎదుటి వ్య‌క్తివైపు నుంచి ఆలోచిస్తే మ‌రోలా ఉంటుంది. అయితే ఏదైనా ఒక అంశంపై అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చాలంటే మొద‌ట‌గా ఎదుటివ్య‌క్తి వైపు నుంచి ఆలోచించడం ప్రారంభించాలి. ఆ వ్య‌క్తి స్థానంలో తానున్న‌ట్లు భావించి విష‌యాల‌ను అవ‌గాహ‌న ప‌ర‌చాలి. లేదంటే ఇరువురి సంవాదంలో మూడో వ్య‌క్తి ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశం ఉంది. ఇటువంటి అంశానికి సంబంధించిన ఓ వీడియోను భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ అట్ట కాగితంపై డ‌బ్ల్యూ అని రాసిఉంటుంది. దాన్ని నేల‌పై ఉంచి ఇది డ‌బ్ల్యూ అని మ‌రొక వ్య‌క్తికి చెబుతాడు. అట్టను అటువైపు నుంచి చూసే వ్య‌క్తి అరె ఇది డ‌బ్ల్యూ కాదు ఎం అని అంటాడు. ఇలా ఇరువురు ఇది డ‌బ్ల్యూ అంటే ఇది ఎం అని వాదానికి దిగుతారు. అంత‌టితో ఆగ‌క త‌న‌దే క‌రెక్ట్ అని డ‌బ్బుల‌ను పందెంగా కాస్తారు. న్యాయ‌నిర్ణేత‌గా మూడో వ్య‌క్తిని పిలుస్తారు. ఆమె అట్ట ముక్క‌కు మ‌రొక‌వైపు నిల‌బ‌డి దాన్ని చూస్తుంది. ఇరువురిని చెరో దెబ్బ వేసి ఇది డ‌బ్ల్యూ కాదు ఎం కాదు అద మూడు అని చెప్పి డ‌బ్బులు తీసుకుని ఎంచ‌క్కా అక్క‌డినుంచి చెక్కేస్తుంది. అవునా ఇది మూడా.. ఇంత సేపు ఇలా పొర‌ప‌డ్డామేంటి అనుకున్న ఇరువురు స‌ద‌రు యువ‌తి నిలుచున్న‌వైపు వెళ్లి చూడ‌గా అది మూడుగా అగుపిస్తుంది. అవును ఇది మూడే అని ఇరువురు ఒకే అభిప్రాయానికి వ‌స్తారు. 


logo