శనివారం 30 మే 2020
Telangana - May 16, 2020 , 02:01:42

బార్లలోని బీర్లు వైన్‌ షాపులకు

బార్లలోని బీర్లు వైన్‌ షాపులకు

  • ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బార్లు, క్లబ్‌లు, టూరిజం రెస్టారెంట్లలో ఉన్న బీర్లను సమీపంలోని ఏ4 షాప్‌లకు తరలించడానికి అనుమతిస్తూ ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపథ్యంలో మార్చి14 నుంచి రాష్ట్రంలో అన్ని బార్లు, క్లబ్‌లు, టూరిజం రెస్టారెంట్లు మూసివేశారు. వాటిలో బీర్ల స్టాక్‌ మిగిలిపోయింది. దీంతో మే 31లోపు గడువు తీరేవే అధికంగా ఉన్నాయి. వాటిని ఏ4 షాప్‌లకు ఇచ్చి తమకు నష్టం జరుగకుండా చూడాలని బార్లు, క్లబ్‌ల ప్రతినిధులు కోరటంతో మే 16 నుంచి 31లోపు గడువు తీరే బీర్లను సమీపంలోని ఏ4 షాపులకు శనివారం ఉదయానికల్ల్లా తరలించడానికి ఎక్సైజ్‌శాఖకు అనుమతి ఇచ్చింది. 


logo