బుధవారం 08 జూలై 2020
Telangana - Feb 09, 2020 , 18:12:39

భక్తులపై తేనెటీగల దాడి..

భక్తులపై తేనెటీగల దాడి..

నల్గొండ: ఓ జాతరకు వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన తిరుమలయ్య గుట్ట జాతరలో చోటుచేసుకుంది. నల్గొండలోని తిరుమలయ్య గుట్ట జాతరకు చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ కొలువుదీరిన స్వామివారు.. భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి. కాగా, జాతరకు కాలినడకన వెళ్లే భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. వారు జాతరకు వెళ్తుండగా.. తేనెటీగలు వారిని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో, వారు వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేసి.. పరిస్థితిని వివరించారు. తక్షణమే స్పందించిన సిబ్బంది, అక్కడికి చేరుకొని వారికి చికిత్స అందించి, అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


logo