బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 07:20:14

బీఈడీ పరీక్ష ఫీజు గడువు పెంపు

బీఈడీ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫీజును జూన్‌ 6వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.

పరీక్షలను జూన్‌, జూలై నెలల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo