గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 06:23:59

హుస్సేన్‌సాగర్‌కు సరికొత్త సొబగులు !

హుస్సేన్‌సాగర్‌కు సరికొత్త సొబగులు !

హైదరాబాద్  : బుద్ధ్దుడు, బుద్ధ విగ్రహాన్ని మించి అతి పెద్ద జాతీయ జెండా.. సరస్సు చుట్టూరా ఆహ్లాదాన్ని నింపే నందనవనాలు.. వెరసి హైదరాబాదీలో పర్యాటక క్షేత్రంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌ తనదైన ఘనతను సొంతం చేసుకుంది.. లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, సంజీవయ్య పార్క్‌లతో పాటు లేజర్‌ షో.. ఇలా దేనికదే ప్రత్యేకత ఉండడంతో ఇక్కడికి దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి గణనీయంగా ఉంటుంది. నిత్యం ఆయా ప్రాంతాల నుంచి  కుటుంబసమేతంగా వచ్చి ఇక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు. ఈ తరుణంలోనే హుస్సేన్‌సాగర్‌కు మరింత కొత్త సొబగులను సమకూర్చాలని హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్ణయించింది. ఇందుకోసం హుస్సేన్‌సాగర్‌ లేక్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనతో పాటు ల్యాండ్‌స్కేప్‌ రీ డెవలప్‌మెంట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల నుంచి ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) నివేదిక సమర్పించాలని టెండర్లను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) ఏజెన్సీని సమర్పించిన ప్రతిపాదనలను అధికారులు స్వీకరించనున్నారు.  డిజైన్లు, ఉత్తమ ప్రతిపాదనలు, ప్రాజెక్టు వ్యయం తదితర అంశాలపై అధ్యయనం చేసి అర్హత సాధించిన ఆయా ఏజెన్సీ సమర్పించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నామని ఇంజినీరింగ్‌ విభాగంలోకి ఓ ఉన్నతాధికారి తెలిపారు. పర్యాటకులకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న అందాలతో పాటు అదనంగా కొత్త అంశాలు, మరిన్ని సుందరీకరణ పనులను చేపట్టనున్నామని అధికారులు పేర్కొన్నారు.  


logo
>>>>>>