శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 16:00:22

దండుమిట్ట తాండ‌లో ఎలుగుబంటి సంచారం

దండుమిట్ట తాండ‌లో ఎలుగుబంటి సంచారం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని జూలూరుపాడు మండ‌లం దండుమిట్ట తాండ స‌మీపంలో ఎలుగుబంటి సంచ‌రిస్తుంది. తాండ స‌మీపంలోని ప్ర‌ధాన ర‌హ‌దారిని దాటుతుండ‌గా కుక్క‌లు త‌ర‌మ‌డంతో ఎలుగుబంటి పంట పొలాల మీదుగా సాయిరాం తాండా స‌మీపంలోని గుట్ట‌బోడు మీద‌కు వెళ్లింది. విష‌యం తెలిసిన వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయ‌క్ రెవెన్యూ, అట‌వీ, పోలీస్ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అట‌వీశాఖ అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మండ‌లంలోని పడమటి నరసాపురం, దండు మిట్ట తాండ‌, సాయిరాంతాండ‌ సమీప గ్రామాల్లోని పంట పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తుండడంతో రైతులు, స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.