బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 14:26:27

కరోనాతో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సందీప్ కుమార్

కరోనాతో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సందీప్ కుమార్

కుమ్రం భీం ఆసిఫాబాద్  : జిల్లాలో కరోనా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమస్యలపై అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడాలన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 70 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో, కాగజ్ గర్, రెబ్బెన, సిర్పూర్ టి లలో  కొత్తగా  క్వారంటైన్  సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేష్  తదితరులున్నారు


logo