బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 12:04:52

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : భారీ వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దావాఖానలో  వర్షం కారణంగా నవాబుపేట మండలంలో ఇంటి గోడ కూలి గాయలపాలైన వారిని  ఆమె పరామర్శించారు. నవాబుపేట మండలంలో ఇండ్లు కూలి ఓ వ్యక్తి మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాత ఇండ్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి పల్లె ప్రగతిలో పాత ఇండ్లను కూల్చివేయించారని, దీంతో వర్షాల వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదన్నారు.logo