శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 13:58:52

కరోనాపై అప్రమత్తంగా ఉండండి..ఆందోళన వద్దు

కరోనాపై అప్రమత్తంగా ఉండండి..ఆందోళన వద్దు

వరంగల్ రూరల్:  కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్ లతో సమావేశమయ్యారు. పరకాల పట్టణంలో ప్రస్తుత పరిస్థితులపై, వార్డులలో ఉన్న సమస్యలపై, కో-ఆప్షన్ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ..అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే ఎవరికైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌన్సిలర్లు కూడా అన్ని వార్డుల్లో రోజు పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కరోనాకు భయపడకుండా జాగ్రత్తలు పాటిస్తే ఆ వైరస్ మన దరికి చేరదని వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo