మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 13:54:59

అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : ఐటీ, పు‌రపాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నివాసంలో  పారిశుద్ధ్య ప‌నులు చేశారు. మొక్కలకు నీళ్లు పట్టారు. ఇంట్లో నీటి నిలువ‌లు లేకుండా చేశారు. చెత్తా చెదారం తీసేసి దోమ‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సీజన్ లో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.

ఇప్పటికే కరోనా వైరస్ విస్తృతి తో ప్రపంచం అతలాకుతలం అవుతున్నదన్నారు. ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ ర‌హితంగా మార్చొచ్చని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. స్వీయ నియంత్రణని పాటించాలన్నారు. అవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు వెళ్లొద్దు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రతి ఒక్క రూ పాటుపడాలని మంత్రి పేర్కొన్నారు.


logo