మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 12:42:47

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్ :  వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు,  కరోనా నివారణపై  వైద్య సిబ్బంది, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు .  

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యం కోసం వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించి, కరోనాపై అవగాహన కల్పించాలని అన్నారు. కరోనా వ్యాధి రోజురోజుకు విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం సామాజిక దూరాన్ని పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.  సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేష్, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు తదితరులున్నారు.logo