శనివారం 06 జూన్ 2020
Telangana - May 11, 2020 , 13:30:34

మామిడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుపాలి

మామిడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుపాలి

మహబూబాబాద్‌ : మామిడి పండ్ల ఉత్పత్తిలో మహబూబాబాద్‌ జిల్లాను అగ్రగామిగా నిలుపాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్ లో సహజ సిద్ధమైన తాజా మామిడి పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. మామిడి పండ్ల ఉత్పత్తిలో జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్బిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. 25 వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగుకు కొంతమంది రైతులు ముందుకొచ్చారని తెలిపారు. అలాగే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా రైతులు పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు పొందాలని మంత్రి పేర్కొన్నారు. 


logo