శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:02:50

మిడతల దాడిని ఎదుర్కోవాలి

మిడతల దాడిని ఎదుర్కోవాలి

  • సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిడతల దండు దాడిని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మిడతలు దాడిచేసే అవకాశం ఉన్న 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అగ్నిమాపక, వ్యవసాయ, అటవీశాఖల అధికారులతో బుధవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలకు సరిహద్దు జిల్లాల్లో మిడతలు దాడిచేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో స్థానికులతో బృందాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. మండలానికో ప్రత్యేక అధికారిని నియమించాలని తెలిపారు. జిల్లాస్థాయిలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటుచేయాలన్నారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, అగ్రిమాపకశాఖ డీజీ సంజయ్‌జైన్‌, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo