శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 03:05:18

వందేండ్ల జిందాతిలిస్మాత్‌

వందేండ్ల జిందాతిలిస్మాత్‌

  • గడపగడపలో పురాతన వైద్యవిధానం
  • సర్వరోగ నివారిణిగా యునానీ మందు
  • సీజనల్‌ వ్యాధులకు స్థానికంగా దివ్యౌషధం
  • ఫారూఖీ పండ్లపొడికీ అంతే ప్రాధాన్యం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: కరోనా నేపథ్యంలో ప్రపం చం మొత్తం భారతీయ ఆయుర్వేదం, యునానీ వైద్యంపై అ త్యంత ఆసక్తి చూపిస్తున్నది. ప్రస్తుతం తెలుగురాష్ర్టాల్లో మాస్కు లు, శానిటైజర్లతోపాటు తప్పనిసరిగా ఉంచుకుంటున్నమందు జిందాతిలిస్మాత్‌. ఇది హైదరాబాద్‌లో తయారయ్యే ప్రసిద్ధమైన యునానీమందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వ రం ఇలా అన్నింటికీ ఇది సర్వరోగనివారిణిలా పనిచేస్తుంది. ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది ఔరంగాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన హకీంమహ్మద్‌ మొయిజుద్దీన్‌ ఫారూఖీ. దాదాపు వందేండ్ల నుంచి ప్రచారంలోఉన్న ఈ ఔషధం పల్లెటూళ్లో పచారీ కొట్టు మొదలు నగరంలో డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ వరకు అన్నింట్లోనూ దొరుకుతుంది. దీంతోపాటు, ఫారూఖీ పండ్లపొడి కూడా అంతే ఆదరణ పొందుతున్నది.

ఫారూఖీ కనిపెట్టిన జిందాతిలిస్మాత్‌

హకీం మహ్మద్‌ మొయిజుద్దీన్‌ ఫారూఖీ యునానీ కోర్సు చేశాడు. షికాగో మెడికల్‌ కాలేజీ ఆఫ్‌ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్‌ అండ్‌ సర్జరీ కోర్సు పూర్తిచేసిన ఆయనకు పరిశోధనలంటే మహాఇష్టం. హైదరాబాద్‌ మోతీమార్కెట్లోని ఇంట్లో దవాఖానను ప్రారంభించిన ఆయన.. ఒకవైపు పేదలకు వైద్యమందిస్తూనే మరోవైపు ఔషధ తయారీకి శ్రమించారు. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వంటి అన్నింటికీ ఒకేమందు తయారుచేయాలని సంకల్పించారు. ఇందుకోసం జిందాతిలిస్మాత్‌ను తయారుచేశారు. ఫలితాన్ని బట్టి మందులో మార్పులు చేర్పులు చేస్తూ చివరకు దివ్యౌషధాన్ని తయారుచేశారు. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ ఫార్ములాను కనిపెట్టాడు. దీంతోపాటు ఫారూఖీ పళ్లపొడి ఫార్ములాను కూడా మొయిజుద్దీన్‌ కనిపెట్టారు.

వినూత్నంగా ప్రచారం

మొయిజుద్దీన్‌ తాను తయారుచేసిన జిందాతిలిస్మాత్‌, ఫారూఖీ పండ్లపొడికి వినూత్న ప్రచారం కల్పించారు. పగలంతా వైద్యంచేసిన ఆయన.. రాత్రి కాగానే ఏదైనా గ్రామానికి వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ మందు వాడండి.. ఇంటిల్లిపాదికీ సర్వరోగనివారిణిగా పనికొస్తుందంటూ చెప్పేవారు. గ్రామాల్లో గోడలపై స్వయంగా ప్రకటనల రూపంలో రాసేవారు. ప్రయాణాల్లో పక్కనున్నవారికి ఉచితంగా వాటిని ఉచితంగా అందజేసేవారు. గాలిపటాలపై కూడా రాయించేవారు. చివరకు ఆయన శ్రమ ఫలించింది. ప్రతి ఇంట్లోనూ జిందాతిలిస్మాత్‌ వచ్చి చేరింది. జిందాతిలిస్మాత్‌, ఫారూఖీ పళ్లపొడి మందులకు తయారీదారు, ప్రకటనకర్త, అమ్మకందారు, కార్మికుడు, యజమాని అన్నీ మొయిజుద్దీన్‌ ఫారూఖీయే.

విశ్వవ్యాప్త మార్కెట్‌

  • ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ ఔషధం ప్రస్తుతం జిందాతిలిస్మాత్‌ పేరుతో పెద్ద కంపెనీగా అవతరించింది. మహ్మద్‌ మొయిజుద్దీన్‌ ఫారూఖీ తనయుడు మహ్మద్‌ ఒవైసుద్దీన్‌ ఫారూఖీ ఈ కంపెనీని నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.12 కోట్లు. ఈ కంపెనీ ఉత్పత్తులు తెలంగాణ, ఏపీపాటు మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, యూఎస్‌, సౌదీ, దుబాయ్‌, అబుదాబీలలో విక్రయింపబడుతున్నాయి. ఈ సంస్థలో 85మంది కార్మికులు పనిచేస్తుండగా.. యంత్రాలను ఉపయోగించకపోవడం ప్రత్యేకత.
  • ‘మస్త్‌ సర్దయింది. దగ్గు ఆగుతలేదు.గాలి పీర్సుకోనికె అయితలేదు. జిందా తిలిస్మాత్‌ పెట్టమ్మ’ తల్లితో ఓ కొడుకు..
  • ‘పొద్ద్దున్నుంచి తలకాయ ఒకటే నొస్తుంది.జర జిందా తిలిస్మాత్‌ ఇయ్యి బిడ్డా’..  కుమార్తెతో ఓ తల్లి. 
  • ‘ఒళ్లంత పుండులెక్క అయింది. కదిలితె గూడ మస్త్‌ నొప్పులు అయితున్నయి. గా జిందా తిలిస్మాత్‌ డబ్బ ఇయ్యి నాయన’ మనువడితో ఓ ముసలవ్వ. జ్వరం వచ్చినా, జలుబు చేసినా.. దగ్గుగా అన్పించినా ఒక్క స్పూన్‌ నీటిలో 

రెండుచుక్కలు వేసుకుని తాగితే రోగం మటుమాయం. ఒంటికి పూసుకోవచ్చు.. ముక్కు దగ్గర పెట్టుకుని వాసనా పీల్చవచ్చు. ముఖ్యంగా సీజనల్‌లో వచ్చే చిన్నపాటి రోగాలకు ఇదొక దివ్యౌషధంగా పనిచేస్తున్నది. వందేండ్లుగా అందరి మనసులను దోచుకుకున్న ఆ యునానీ మందు జిందాతలిస్మాత్‌. దేశీయ యునానీ వైద్యవిధానంలో వ్యాపారలాభాపేక్షలేని సంస్థనుంచి వెలువడుతున్న జిందాతిలిస్మాత్‌ ఒక సంచలనం. దంతాలు తళతళ మెరిసేలాచేసే ఫారూఖీ పండ్లపొడి కూడా ఈ సంస్థ నుంచి తయారవుతున్నదే.

బాటిల్‌పై నీగ్రో బొమ్మ

జిందాతిలిస్మాత్‌ బాటిల్‌పై ఆఫ్రికన్‌ నీగ్రోబొమ్మ లోగో ఉంటుంది. అదిచూసి అప్పట్లో.. ఒక ఆఫ్రికన్‌ ఫారూఖీకి ఈ ఫార్ములా చెప్పి ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ, నీగ్రోబొమ్మ పెట్టడం వెనుక మరో కారణముంది. నిజాం సైన్యంలో అప్పట్లో ఆఫ్రికన్లు ఎక్కువగా ఉండేవారు. వాళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఔషధంపై వారిబొమ్మ ముద్రిస్తే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని భావించారు. ఈ సంస్థ యజమానులు దీనిని ఒక వ్యాపారంలా కాకుండా సేవా కార్యక్రమంలా భావిస్తారు. ప్రకృతివైపరీత్యాలు జరిగినప్పుడు వీరివంతుగా జిందాతిలిస్మాత్‌, ఫారూఖీ పళ్లపొడి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏటా హైదరాబాద్‌ నుంచి హజ్‌యాత్రకు వెళ్లేవారికి కూడా దీన్ని బహుమతిగా ఇస్తారు.logo