గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 19:50:24

వృద్ధ లంబాడా దంపతులకు భలే గిఫ్ట్

వృద్ధ లంబాడా దంపతులకు భలే గిఫ్ట్

సంగారెడ్డి: భారత్ డైనమిక్ లిమిటెడ్ (భానూర్) ఉద్యోగులు ఓ వృద్ధ లంబాడా దంపతులను ఆదుకున్నారు. వారికి రూ.1.24 లక్షల విలువైన జత ఎడ్లను బహుమతిగా అందించి వారు వ్యవసాయం చేసుకునేందుకు అండగా నిలిచారు. బీడీఎల్ ఉద్యోగుల దాతృత్వానికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

మహాబుబాబాద్ జిల్లాలోని నర్సింహులగుడెం గ్రామంలోని బస్తారామ్ తాండాకు చెందిన బనోత్ సేత్యారామ్, దుర్గికి చెందిన ఎడ్లు తన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ షాక్ కు గురై గత నెల 19 న దుర్మరణం పాలయ్యాయి. ఎడ్ల మృతదేహాల వద్ద ఏడుస్తున్న సేత్యారామ్ దంపతుల ఫొటో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.  ఈ విషాదాన్ని చూసి చలించిన విన్నర్స్ ఫౌండేషన్‌ను స్థాపించిన బీడీఎల్-భానూర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అరికేపుడి రఘు.. ఆ వృద్ధ లంబాడా రైతు దంపతుల దుస్థితిని వివరిస్తూ ఫౌండేషన్ సభ్యుల నుంచి నిధులు సమీకరించారు. రూ.1.24 లక్షలు వెచ్చించి ఎడ్ల జతను కొనుగోలు చేసిన రఘు.. అప్రెంటిస్ రుద్రోజు తేజస్వినితో కలిసి మహబూబాబాద్ వెళ్లి వారికి అందజేశారు.

"ఈ సమయంలో మా కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసి జత ఎడ్లను కొనివ్వడం చాలా అనందంగా ఉన్నది" అని సేత్యారామ్ చెప్పారు. బీడీఎల్ ఉద్యోగులకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన భార్య దుర్గి అన్నారు. లంబాడా దంపతులకు ఎడ్ల జత కొనివ్వడానికి విరాళాలు అందజేసిన సహోద్యోగులందరికీ అరికేపూడి రఘు కృతజ్ఞతలు తెలిపారు. logo