గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 04:59:30

కేసీఆర్‌ దృష్టికి బీసీ క్రీమీలేయర్‌ సమస్య

కేసీఆర్‌ దృష్టికి బీసీ క్రీమీలేయర్‌ సమస్య

  • మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌
  • సివిల్‌కు ఎంపికైన బీసీ, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు సన్మానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రం పరిధిలో పరిష్కారానికి నోచని బీసీ క్రీమీలేయర్‌ విధానం వల్ల ఎదురవుతున్న సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మిథున్‌రాజా, సత్యప్రకాశ్‌, కే శశికాంత్‌, పీ సందీప్‌, బీ రాహుల్‌, శీతల్‌కుమార్‌, ఎం మకరంద్‌ను, టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌, కార్యదర్శి ప్రతాప్‌, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీకాంత్‌ను మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌ సత్కరించారు. 


logo