శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Sep 22, 2020 , 01:56:26

వ్యతిరేకించేవారి నోరు నొక్కుతారా?

వ్యతిరేకించేవారి నోరు నొక్కుతారా?

  • లోక్‌సభలో ఎంపీ బీబీపాటిల్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకొనేందుకు యత్నిస్తున్నదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీపాటిల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నోరునొక్కుతున్నారని ఆక్షేపించారు. సోమవారం లోక్‌సభలో ఫారిన్‌ కంట్రిబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా బీబీపాటిల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని బెదిరించేందుకు ఈ చట్టాన్ని వినియోగించుకునే అవకాశమున్నదని అనుమానం వ్యక్తంచేశారు. విదేశీనిధుల ద్వారా నిర్వహించే సంస్థల వ్యయాన్ని 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడం సరికాదని పేర్కొన్నారు.