శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:59:41

బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ

బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటల సీడీలు, పుస్తకాలను జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచన మేరకు ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఈ ఏడాది రికార్డుచేసిన ఎనిమిది సంప్రదాయ బతుకమ్మ పాటల సీడీతోపాటు మూడు ప్రత్యేక  గీతాలను విడుదల చేశారు. వీటితోపాటు పాకెట్‌సైజులో ముద్రించిన బతుకమ్మ పాటల పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. దామోదర్‌రెడ్డి దర్శకత్వంలో విడుదలైన మూడు గీతాలను తేలు విజయ, పద్మావతి, స్ఫూర్తి, వరం గానం చేశారు. వీటిని కోదారి శ్రీను సేకరించి, రచించగా,  సంగీతాన్ని వేణు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడె రాజీవ్‌సాగర్‌, వరలక్ష్మి, సాంస్కృతిక విభాగం కన్వీనర్‌ కోదారి శ్రీను, కార్యదర్శి రజిత, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అధ్యక్షులు అవంతుల ప్రశాంత్‌, అర్చన సేనాపతి, ఈగ సంతోష్‌ పాల్గొన్నారు. 


logo