మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 15:51:14

సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ సారె

సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ సారె

ములుగు : బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారి బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదింటి ఆడబిడ్డలకు చీరెల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. కాగా, ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క, సారమ్మ వనదేవతలకు మొదటి బతుకమ్మ సారెను సమర్పించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గిరిజన, స్ర్తీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ఎంపీ కవితతో కలిసి అమ్మవార్లకు సమర్పించి నూతన ఒరవడికి నాంది పలికారు. అనంతరం జిల్లాలో ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేశారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారికి సైతం బతుకమ్మ చీరెను మంత్రి కానుకగా సమర్పించారు.


 అనంతరం దేవస్థానం దగ్గర ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 24, 27వ వార్డు మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంతు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo