గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 15:02:40

ఆడ బిడ్డలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరెలు

ఆడ బిడ్డలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరెలు

వరంగల్ అర్బన్ : తెలంగాణ ఆడ బిడ్డలకు పండుగ కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందజేస్తున్నారన్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధిలో గల వడ్డేపల్లి పార్క్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాలు బతుకమ్మ పండుగను పట్టించుకునేవారు  కాదనన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ నిర్వహించి పండుగకు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చారని పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్ని తెలంగాణ పండుగలకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. అనంతరం పశువుల దవాఖాన ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమలలో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, మహిళలు పాల్గొన్నారు.logo