సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:50

కంచెగా బతుకమ్మ చీరె.. అబద్ధం

కంచెగా బతుకమ్మ చీరె.. అబద్ధం

తోటను పశువులు పాడుచేయకుండా ఓ రైతు బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటుచేసుకున్నాడని సాక్షి దినపత్రికలో వార్త రాశారు. కానీ ఇది అబద్ధం.

వాస్తవం

‘తోటకు కంచెగా బతుకమ్మ చీరెలు’ అనే శీర్షికన వచ్చిన ఈ వార్తపై చేనేత జౌళిశాఖ ఏడీ అశోక్‌రావు స్పందించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలోని 50 మంది సమక్షంలో ఘటనపై విచారణ చేశామని, రైతులు జంగిటి అంజయ్య, కాసారాపు ఆశయ్య, కాసారపు ఎల్లయ్య ఎల్లిగడ్డ పంట వేయగా, రక్షణ కోసం 9 రంగుల్లోని చీరెలను కంచెగా కట్టినట్టు తెలిపారు. ఇందులో 8 చీరెలు షాపులో కొనుగోలు చేసినవని, ఒక చీర 2018లో ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పంపిణీ చేసినదని చెప్పారు. రెండేండ్ల పాటు ఆ చీరను వినియోగించటంతో చిరిగిపోయిందని, దాంతోనే ఆ చీరెను కంచెగా వినియోగించారని తెలిపారు. సాక్షి పత్రికలో మాత్రం బతుకమ్మ చీరెలను కట్టుకోకుండానే కంచెగా వినియోగించారని వార్త ప్రచురించారని, ఇది పూర్తి అవాస్తవమని వెల్లడించారు. పత్రికపై చర్యలకు సిఫారసు చేసినట్టు ఏడీ పేర్కొన్నారు.

- సిరిసిల్ల రూరల్‌


logo