మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 01:16:35

రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబురాలు

 రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్‌భవన్‌లో శుక్రవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజ్‌భవన్‌ ఉద్యోగులు, సిబ్బందికి చీరెలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైందని అభివర్ణించారు. ఆడబిడ్డలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన గడ్డతో మమేకమయ్యే ఒక విశిష్టమైన సందర్భమని చెప్పారు. పండుగ వేళ ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే ఆహార పదార్థాలు మహిళలకు పోషక విలువలను అందిస్తాయని తెలిపారు. సంబురాల్లో పాలుపంచుకుంటున్నందున తెలంగాణ సోదరిగా, ఆడబిడ్డగా ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. అనంతరం కరోనాపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వీడియోను తమిళిసై ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి కే సురేంద్ర మోహన్‌, సంయుక్త కార్యదర్శులు జే భవానీ శంకర్‌, సీఎన్‌ రఘుప్రసాద్‌ పాల్గొన్నారు.