ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 13:48:32

బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

నిర్మల్ : బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు మంత్రి అల్లోల బతుకమ్మ చీరలను అందజేశారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి సూచించారు.logo