శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:01

వచ్చే నెల 16 నుంచి బతుకమ్మ పండుగ

వచ్చే నెల 16 నుంచి బతుకమ్మ పండుగ

  • 24న సద్దుల బతుకమ్మ
  • తెలంగాణ విద్వత్‌సభ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వచ్చేనెల 16న బతుకమ్మ పండుగను ప్రారంభించాలని తెలంగాణ విద్వత్‌సభ నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో సిద్ధాంతులు, వేద పండితులు నిర్ణయించారు. బతుకమ్మ పండుగపై భిన్న ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో శృంగేరిమఠం నుంచి శుక్రవారం జూమ్‌ యాప్‌ ద్వారా 32 మంది సిద్ధాంతులు, పలువురు వేద పండితులు, పురోహితులతో సమావేశాన్ని నిర్వహించారు. బతుకమ్మ పండుగపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలంగాణ విద్వత్‌సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ, కార్యదర్శి దివ్యజ్ఞానసిద్ధాంతి తెలిపారు. అక్టోబరు 16న (అధిక ఆశ్వీయుజ అమావాస్య) ఎంగిలిపూల బతుకమ్మను ప్రారంభించి అక్టోబరు 24(నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి)న సద్దుల బతుకమ్మ పండుగ, 25న దసరా జరుపుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.logo