గురువారం 28 మే 2020
Telangana - May 20, 2020 , 19:03:41

జనాభాకు తగ్గట్టు బస్తీ దవాఖానాలు: మేయర్‌ బొంతురామ్మోహన్‌

జనాభాకు తగ్గట్టు బస్తీ దవాఖానాలు: మేయర్‌  బొంతురామ్మోహన్‌

హైదరాబాద్‌: జనాభాకు తగ్గట్టు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఇవాళ మేయర్‌ మీడియాతో మాట్లాడుతూ..ప్రాథమిక టెస్టులు చేసే విధంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచన. ఎల్లుండి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నోడల్‌ ఆఫీసర్లను నియమించినట్లు పేర్కొన్నారు.

నగరంలో 40900 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు సిద్ధంగా ఉన్నవి. మిగితా 41వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లను జులై నాటికి అందిస్తామన్నారు. పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo