ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 12:50:32

మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానలు : మంత్రి కేటీఆర్‌

మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానలు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : బస్తీల్లోని పేదలకు మెరుగైన ప్రాథమిక వైద్యం అందించేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోందని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శుక్రవారం హబ్సిగూడలోని రాంరెడ్డినగర్‌లో జీహెచ్ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ సాధననే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల ఇంటి వద్దకే మెరుగైన వైద్యం అందించాలన్నది సీఎం కేసీఆర్‌ సంకల్పమని చెప్పారు. అదేవిధంగా రాంగోపాలపేట డివిజన్‌లోని నల్లగుట్టలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బస్తీ దవాఖానను ప్రారంభించగా.. గాంధీనగర్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ముఠా గోపాల్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 168 దవాఖానలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇవాళ 25 దవాఖానలను ప్రారంభించింది.  ప్రతి వార్డుకు రెండు దవాఖానల చొప్పున 300 దవాఖాలను ఏర్పాటు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు.


logo