సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 10:39:43

రూ.5.75 కోట్లతో బాసర క్షేత్రం అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రూ.5.75 కోట్లతో బాసర క్షేత్రం అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

బాసర : బాసర జ్ఞాన సరస్వతీదేవి క్షేత్రాన్ని రూ.5.75కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన బాస‌రలో ఆల‌య అభివృద్ది ప‌నుల‌కు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రూ. 5. 75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వీఐపీ అతిథిగృహం ఆధునీక‌ర‌ణ‌, టీటీడీ పక్కన భవనం నుంచి వ్యాస మహర్షి గృహం వరకు షెడ్‌ నిర్మాణం, ఆలయ ప్రహరీ నిర్మాణం, నది ఒడ్డున సూర్యేశ్వర ఆలయం వద్ద షెడ్‌ నిర్మాణ పనులకు మంత్రి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రానికి వచ్చే భక్తుల కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అమ్మవారికి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వారందరికీ ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo