ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 17:33:51

ఐదు నెల‌ల అనంత‌రం పూర్తిస్థాయిలో తెరుచుకున్న బాస‌ర ఆల‌యం

ఐదు నెల‌ల అనంత‌రం పూర్తిస్థాయిలో తెరుచుకున్న బాస‌ర ఆల‌యం

నిర్మ‌ల్ : ప్రఖ్యాత శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైవున్న బాస‌ర ఆల‌యం ఐదు నెల‌ల విరామం అనంత‌రం ఆదివారం పూర్తిస్థాయిలో తెరుచుకుంది. క‌రోనా మహమ్మారి కారణంగా ఈ ఆలయం మార్చి 20న మూసివేయబడింది. ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ భ‌క్తుల ద‌ర్శ‌నాలు, ఆర్జిత సేవా, అభిషేకం, హ‌ర‌తి, అక్ష‌రాభ్యాసం వంటి ఇత‌ర సేవ‌లను పూర్తిస్థాయిలో ప్రారంభించిన‌ట్లు చెప్పారు. ఆల‌యానికి విచ్చేసే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించాల‌న్నారు. 


logo