శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 15:07:32

కరోనాతో ఉద్యోగి మృతి.. కోఠిలో బ్యాంకు మూసివేత

కరోనాతో ఉద్యోగి మృతి.. కోఠిలో బ్యాంకు మూసివేత

హైదరాబాద్‌ : కోఠిలోని ఓ బ్యాంకు ఉద్యోగి కరోనా వైరస్‌తో మృతి చెందాడు. దీంతో ఆ బ్యాంకును పోలీసులు మూసివేశారు. ఆ బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి గత నెల రోజుల నుంచి సెలవులో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం బ్యాంక్‌కు వచ్చి వెళ్లాడు సదరు ఉద్యోగి. అయితే ఆ ఉద్యోగి ఇటీవలే కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా బ్యాంకును అధికారులు మూసేసి.. 40 మంది ఉద్యోగులను క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. బ్యాంకుతో పాటు ఆ పరిసరాలను జీహెచ్‌ఎంసీ అధికారులు.. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో పిచికారీ చేశారు. 


logo