మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 15:18:36

వినోద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తన్న

వినోద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తన్న

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం వినోద్‌కుమార్‌కు నేరుగా ఫోన్‌ చేసిన దత్తన్న.. శుభాకాంక్షలు చెప్పారు.

బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో పార్లమెంట్ సభ్యుడిగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా.. ప్రజా జీవితంలో న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా మరిన్ని అభివృద్ధి, సేవాకార్యక్రమాలు చేపడుతూ విశేషమైన కృషి చేస్తున్న గొప్ప నాయకుడని దత్తాత్రేయ కొనియాడారు. వినోద్ కుమార్ సౌమ్యులు, మృదుస్వభావి అని, సామాజిక సమస్యల మీద అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా నాయకుడని, తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర నిర్వహించారని బండారు దత్తాత్రేయ ప్రశంసించారు.


logo