బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:12:18

దత్తాత్రేయకు బర్త్‌డే విషెస్‌

 దత్తాత్రేయకు బర్త్‌డే విషెస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఆయన 73వ జన్మదినాన్ని జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలాసీతారామన్‌, పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.


logo