బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 19:22:44

జ‌గ‌దీష్‌రెడ్డికి హిమాచ‌ల్ గ‌వ‌ర్న‌ర్‌, మంత్రి ఈట‌ల శుభాకాంక్ష‌లు

జ‌గ‌దీష్‌రెడ్డికి హిమాచ‌ల్ గ‌వ‌ర్న‌ర్‌, మంత్రి ఈట‌ల శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీష్‌రెడ్డి జ‌న్మ‌దినం నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, రాష్ర్ట వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. బండారు దత్తాత్రేయ మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డికి టెలిఫోన్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పనిచేసి, చురుకైన పాత్ర నిర్వహించి, తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా సేవ‌లందిస్తున్నార‌న్నారు. ఆయ‌న‌కు భగవంతుడు ఇంకా మంచి పదవులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఈట‌ల ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ...  ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. 


logo