గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 10:20:26

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బంద్‌.. అందుబాటులో నిత్యావసర సేవలు

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బంద్‌.. అందుబాటులో నిత్యావసర సేవలు

కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. మార్చి 31 వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని సీఎం సూచించినట్లుగా ప్రజలంతా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. నిత్యావసర సేవలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పెట్రోల్‌ బంక్‌లు, పాల కేంద్రాలు తెరిచి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోకే ప్రజలు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్తున్నారు. శానిటేషన్‌ సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. logo
>>>>>>